Live: కేంద్ర బడ్జెట్‌పై 'ఈటీవీ భారత్' ప్రత్యేక చర్చ - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video
ETV Bharat Special Discussion: సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆకాంక్షల మధ్య ఈ బడ్జెట్ తీసుకొస్తోంది. ఈసారి బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలు ఉండకపోవచ్చంటూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రోజుల ముందు కీలక ప్రకటన చేశారు. తాత్కాలిక బడ్జెట్ కాబట్టి పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు.
ఉదయం 11 గంటలకు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. గతేడాది మాదిరిగా ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపించనున్నారు నిర్మల. ఈ సారి బడ్జెట్‌లో పీఎం-కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతారన్న అంచనాలు ఉన్నాయి. పట్టణ ప్రజల కోసం పీఎం- ఆవాస్ యోజన తరహా పథకం, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, విద్యుత్ వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు ఉండొచ్చని తెలుస్తోంది. గత కొన్ని బడ్జెట్‌లుగా మౌలిక వసతులపై దృష్టిసారించిన ప్రభుత్వం, ఈసారి ప్రజలను ఆకట్టుకునేలా ఏవైనా ప్రకటనలు చేస్తుందా అనే దానిపై ఈటీవీ భారత్ స్పెషల్ డిస్కషన్ మీకోసం.