ప్రధాని నరేంద్ర మోదీ - ఎంపీ బీబీ పాటిల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం : ఈటల రాజేందర్ - Etela Rajender on KCR - ETELA RAJENDER ON KCR
🎬 Watch Now: Feature Video
Published : Apr 20, 2024, 8:40 PM IST
Etela Rajender in BJP Meeting : తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేశారని ప్రజలు బీఆర్ఎస్ను రెండుసార్లు గెలిపిస్తే, ఆయనకు అహంకారం పెరిగి పార్టీ నేతలు, కార్యకర్తలనే అవమానించారని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లేనని విమర్శించారు. ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇవాళ కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బీజేపీ మోర్చా కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌తో కలిసి ఈటల పాల్గొన్నారు. అన్నిరంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీకి 400 సీట్లు రావడం ఖాయమని, ఆయన మళ్లీ ప్రధాని అవుతారని ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడోసారి బీబీ పాటిల్ ఎంపీగా హ్యాట్రిక్ కొడతారని పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి, ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు. అంతకుముందు ఆయన బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.