thumbnail

డ్రగ్స్​కు బానిసలయ్యారా - అయితే చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి రండి - Special Drug Treatment In Erragadda

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 3:58 PM IST

Special Drug Treatment In Erragadda Mental Hospital : పాఠశాల వయసు నుంచే చిన్నారులు మత్తు రుచి చూస్తున్నా ఇంటర్​కి వచ్చే సరికి మహమ్మారికి బానిసలవుతున్న విషయం ఎవరూ గుర్తించడం లేదు. తల్లిదండ్రులు ఆ విషయాన్ని గుర్తించటంలో మాత్రం జాప్యం అవుతోంది. తీరా కళ్లుతెరిచే సరికే వారు ఆ మత్తు చేతిలో చిత్తవుతున్న దుస్థితి. అయితే విషయం తెలిసినా ఎక్కడికి వెళ్లాలి ఎలా మత్తు నుంచి తమ బిడ్డలను కాపాడుకోవాలని తెలియక మరికొందరు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందంటున్నారు వైద్యులు. 

పిల్లలు మత్తుకు అలవాటు పడ్డారని బయటకు తెలిస్తే ఏం అవుతుందో అన్న భయంతో పిల్లల భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెడుతున్న పరిస్థితి. అయితే దీనికి పరిష్కారం చూపుతోంది ఎర్రగడ్డ మానసిక వైద్య ఆస్పత్రి. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా డ్రగ్స్ ట్రీట్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితులకు సేవలు అందిస్తోంది. అంతేకాదు వారి గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా చూస్తోంది. ఇంతకి ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి చికిత్స అందిస్తారో ఇప్పుడు చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.