పోస్టల్ బ్యాలెట్ గడువు పెంచండి- ఈసీకి ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి - Employees Association Appeals to EC - EMPLOYEES ASSOCIATION APPEALS TO EC
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 9:34 PM IST
Employees Association Appeals to EC to Extend Postal Ballot Deadline: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచాల్సిందిగా ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (AP Revenue Employees Union) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి (State Chief Electoral Officer) విజ్ఞప్తి చేసింది. అలాగే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు వీలుగా తెలంగాణఆ తరహాలోనే ఒక రోజు స్పెషల్ క్యాజువల్ లీవును మంజూరు చేయాల్సిందిగా ఉద్యోగుల సంఘం నేతలు బొప్పరాజు, వలిశెట్టి దామోదర్ తదితరులు ఎన్నికల కమీషన్ని (Election Commission) కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉద్యోగులకు ఇంకా ఎన్నికల విధులను కేటాయిస్తూనే ఉన్నారని ఈ మేరకు జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అవుతున్నాయని వెల్లడించారు. సదరు ఉద్యోగుల సౌకర్యం కోసం పోస్టల్ బ్యాలెట్ జారీ కోసం ఈ నెల 30వ తేదీ వరకూ పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువును పెంచాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.