వరద బాధితులకు 'ఈనాడు' ఆపన్నహస్తం- ముంపు గ్రామాల్లో నిత్యవసరాల పంపిణీ - Eenadu Support to Flood Victims - EENADU SUPPORT TO FLOOD VICTIMS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 5:24 PM IST
Eenadu Support to Flood Victims in krishna District : కృష్ణా జిల్లా గన్నవరం వరద బాధితులకు 'ఈనాడు' సంస్థ ఆపన్నహస్తం అందించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు, ఏలేరు కాలువలకు గండ్లు పడి గన్నవరం నియోజకవర్గంలో పొలాలను ముంచెత్తాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ వరద బాధితులకు ఈనాడు సంస్థ మేమున్నామంటూ అండగా నిలబడింది. ముంపునకు గురైన గ్రామాల్లో 'ఈనాడు' సంస్థ ఉద్యోగులు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. విజయవాడ యూనిట్ ఇన్‌ఛార్జ్ కిశోర్ నేతృత్వంలో ఈనాడు సిబ్బంది ట్రాక్టర్ ద్వారా కిట్లను తీసుకెళ్లి ముంపు గ్రామాల్లో ప్రజలకు అందజేశారు. కష్టకాలంలో తమను 'ఈనాడు' సిబ్బందికి ముంపు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ట్రాక్టర్లో సహాయ సామగ్రిని ఆయా గ్రామాలకు వెళ్లి బాధితులకు అందించారు. ఇళ్లల్లో ధాన్యం, బియ్యం, నిత్యవసర సరుకులు, దుస్తులు, పుస్తకాలు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ పనికి రాకుండా పోయాయని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.