యాదాద్రిని దర్శించుకున్న 'స్టడీ టూర్ ఎకనామిక్ సెక్యూరిటీ' బృందం - Delhi Officials Visits Yadadri
🎬 Watch Now: Feature Video


Published : Mar 18, 2024, 4:51 PM IST
Economic Study Tour Officers Visits Yadadri : దిల్లీ నేషనల్ డిఫెన్స్ కాలేజీ ద్వారా దేశ, విదేశాలకు చెందిన 16 మంది బృందం మేజర్ జనరల్ ఏకే. సింగ్ ఆధ్వర్యంలో " స్టడీ టూర్ ఎకనామిక్ సెక్యూరిటీ " కార్యక్రమం కింద తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని ఏకే. సింగ్ బృందం దర్శించుకుంది. జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర వారికి స్వాగతం పలికారు.
మరోవైపు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎ.భాస్కరరావు, భువనగిరి ఆర్డీవో అమరేందర్, తదితర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మెత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందుకు కలగకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.