ఈ-ఏపీసెట్ పరీక్షల తేదీ ప్రకటించిన విద్యాశాఖ- షెడ్యూల్ ఇదే - E APSET Exam Schedule
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 10:44 AM IST
E-APSET Exam Schedule: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ-ఏపీసెట్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. మే 13వ తేదీ నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశాలకు(( B Tech Second Year Entrance Exams) నిర్వహించే ఈసెట్(E-SET)ను మే 8న నిర్వహించనున్నారు.
Common Entrance Tests 2024: మే 6న ఐసెట్(I-SET), మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్(PG E-SET)నిర్వహించనున్నారు. జూన్ 8న ఎడ్‌సెట్(ED SET Exam), 9న లాసెట్ పరీక్షలు(LAW SET Exams) జరగనున్నాయి. పీసెట్ పరీక్ష(P CET Exam) తేదీని త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ మండలి తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, కన్వీనర్, పరీక్ష నిర్వహించే వర్సిటీల వివరాలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది ఈ-ఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీయూ(JNTU) కి అప్పగించింది.