ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన 2008 డీఎస్సీ అభ్యర్థులు - DSC 2008 update
🎬 Watch Now: Feature Video
Published : Mar 5, 2024, 3:43 PM IST
DSC-2008 Aspirants Issue : ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు ఆర్జీలు సమర్పించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన 2008 డీఎస్సీ అభ్యర్ధులు ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తాము డీఎస్సీ పూర్తి చేశామని అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. తాజాగా గత నెలలో హైకోర్టు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ ఇంకా కల్పించలేదని వాపోయారు. ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించే వరకు తాము ప్రజా భవన్ వద్దే బైఠాయిస్తామని తెలిపారు.
Prajavani program : రాయదుర్గం పాన్‌మట్కా ప్రాంతానికి చెందిన పలువురు తమ స్థలాన్ని కొందరు బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయమై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం కబ్జాదారుల బారి నుంచి తమ స్థలాలను పరిరక్షించాలని కోరారు.