అంబర్‌పేట్‌లో మందుబాబు వీరంగం - రాంగ్ రూట్‌లో వెళ్లొద్దన్నందుకు కానిస్టేబుల్‌పై దాడి - కానిస్టేబుల్‌పై తాగుబోతు దాడి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2024/640-480-20738317-thumbnail-16x9-drunk.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 13, 2024, 1:44 PM IST
Drunk Man Attacks Traffic Constable in Hyderabad : విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ అంబర్‌పేటలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ఓ మందుబాబు దాడి చేశాడు. ముసారాంబాగ్ వద్ద బ్రిడ్జి పనులు కొనసాగుతుండగా కానిస్టేబుల్ నాగరాజు ట్రాఫిక్ డైవర్షన్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాంగ్ రూట్లో ఆటోలో వస్తున్న వ్యక్తిని ఆ మార్గంలో ప్రయాణించవద్దని సూచించారు.
అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ రోహిత్ కానిస్టేబుల్ గొంతు పట్టి దాడి చేస్తూ దుర్భాషలాడాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చి వెంటనే విడిపించి ఆటో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి అంబర్‌పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 199 పాయింట్లు వచ్చినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు. విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి చేసినందుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోహిత్‌ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు.