thumbnail

LIVE: విజయవాడ పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ షో - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 24 minutes ago

Dron Show at Punnami Ghat Live :ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిద్దటమే లక్ష్యంగా జాతీయ స్థాయి డ్రోన్‌ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి సీకె కన్వెన్షన్​లో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. డ్రోన్ సమ్మిట్​లో 6929 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. 53 స్టాల్స్​లో డ్రోన్​ల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఏపీని డ్రోన్ హబ్​గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ షో జరుగుతోంది. దేశంలో తొలిసారిగా 5,500 డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్ షో నిర్వహించారు.  8 వేల మంది డ్రోన్ షో వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డ్రోన్‌ షో వీక్షించేలా విజయవాడలో నాలుగు చోట్ల డిస్‌ప్లేలు సైతం ఏర్పాటు చేశారు.
Last Updated : 24 minutes ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.