ఇంటింటికి కుళాయిలు ఎక్కడ ? - రోడ్డుపై మహిళల ఆందోళన - women fired on YSRCP Government
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-03-2024/640-480-20991998-thumbnail-16x9-drinking-water-crisis-at-taatikayala-vaari-palem.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 4:53 PM IST
Drinking Water Crisis at Taatikayala Vaaripalem: ఇంటింటికి (Each House) తాగు నీళ్లు అందిస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది కానీ నీటి సరఫరా చేసేందుకు పైప్లైన్లు (Pipelines) వేయటం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో గొంతెండి పోతున్నా గుక్కెడు తాగునీళ్లు ఇవ్వకపోవడంపై గృహిణులు ఆవేదన చెంది రోడ్డుపై బిందెలతో నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని తాటికాయలవారి పాలెంలో ప్రజలు తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహించిన గృహిణులు గ్రామానికి ఎదురుగా ఉన్న రాజవరం - పొదలాడ రహదారిపై (Rajavaram-podalaada) రాస్తారోకోకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని మహిళలు నినాదాలు చేశారు. ఇంటింటికి కుళాయిలు అన్నారు, అవి ఎక్కడున్నాయంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు.