వైద్యుల సస్పెన్షన్‌పై నల్ల బ్యాడ్జీలతో డాక్టర్స్ నిరసన - Doctors protest against Suspension
🎬 Watch Now: Feature Video


Published : Feb 12, 2024, 5:31 PM IST
Doctors Strike against Suspension at Kamareddy : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కరిచిన ఘటనలో సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు వైద్యులకి మద్దతుగా తోటి వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నినాదాలు చేశారు. మరోవైపు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో కూడా ప్రభుత్వ డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
Doctors protest against Suspension for Rat Bite : రోగికి సేవలందించడమే వైద్యుల వృత్తి అని, జరిగిన ఘటనకు శానిటరీ ఏజెన్సీ నిర్వాహకులను బాధ్యులను చేయాలని మహబూబాబాద్ జిల్లాలో వైద్యులు డిమాండ్ చేశారు. సస్పెన్షన్‌ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైద్యులను సస్పెన్షన్ చేయడంపై కామారెడ్డి జిల్లా వైద్య యూనియన్ నేత తిరుపతిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.