వైద్యులారా వందనం!! - కొండలు వాగులు దాటి గిరిజనులకు వైద్యసేవలు - Health Camp In Mulugu - HEALTH CAMP IN MULUGU
🎬 Watch Now: Feature Video


Published : Jul 11, 2024, 12:02 PM IST
Health Camp In Mulugu : ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు మండలం పెనుగోలు గ్రామంలో గిరిజనులకు వైద్యాధికారి మధుకర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అయితే ఈ గ్రామానికి వెళ్లడానికి వైద్యులు చాలా కష్టపడ్డారు. మండల కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై పెనుగోలు గ్రామం ఉంది. ఈ గ్రామంలో 10 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి వైద్యం కోసం వైద్యులు గ్రామస్థుల సాయంతో కాలి నడకన కొండలు, వాగులు దాటుకుంటూ వెళ్లి హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
Medical Services For Tribal In Mulugu : గ్రామంలోని 39 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నీరసంగా ఉన్న వారికి గ్లూకోజ్ బాటిల్స్ పెట్టి మందులు పంపిణీ చేశారు. దోమల మందును గ్రామంలో పిచికారీ చేయించారు. వర్షా కాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులకు వైద్యులు సూచించారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు వాజేడు మండల కేంద్రానికి వైద్య సిబ్బంది చేరుకున్నారు.