మేం ఒంటరిగానే పోటీ చేస్తాం - పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఆపే శక్తి ఎవరికీ లేదు : డీకే అరుణ - BRS
🎬 Watch Now: Feature Video
Published : Feb 4, 2024, 4:10 PM IST
DK Aruna Fires on Congress : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి సాధ్యం కావాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు. 100 రోజుల్లో అరు గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతూనే, రాష్ట్రం అప్పుల పాలైందని కాంగ్రెస్ తప్పించుకుని ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామనడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. బోటాబోటి సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ మాట్లాడటం సరికాదని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందన్నారు.