కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన దివ్యాంగ విద్యార్థులను అభినందించిన లోకేశ్ - Divyang Students met Lokesh - DIVYANG STUDENTS MET LOKESH
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-07-2024/640-480-21901194-thumbnail-16x9-divyang-students-met-lokesh.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 10:46 PM IST
Divyang Students met Minister Nara Lokesh: దివ్యాంగ విద్యార్థుల సమస్య దృష్టికి రాగానే వేగంగా పని చేసిన అధికారులందరినీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ప్రముఖ కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన 25 మందికి సొంత ఖర్చులతో ల్యాప్‌ట్యాప్‌లను బహూకరించారు. వారిని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. జాతీయస్థాయిలో పేరున్న ఐఐటీ, ఎన్ఐటీల్లో సీటు కొట్టడం అంత సులభం కాదన్నారు. ఏడాదికి 5లక్షల ఉద్యోగాలు కల్పించడం, తద్వారా పేదరికంలేని ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఏడాదిలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అనివృద్ధి చేస్తామని తెలిపారు. దేవుడు పెట్టిన అన్ని పరీక్షల్లోనూ విద్యార్థులు విజయం సాధించారని ఇక వారికి తిరుగులేదని అన్నారు. దివ్యాంగ విద్యార్థుల సమస్య దృష్టికి వచ్చిన వెంటనే ఇంత వేగంగా పనిచేసిన అధికారులందరినీ పేరుపేరునా అభినందించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలన్నది తమ ధ్యేయమని లోకేశ్ స్పష్టం చేశారు. విద్యాశాఖకు సరైన వ్యక్తి మంత్రిగా వచ్చాడని విద్యార్థులు తెలిపారు. తమ బిడ్డల భవిష్యత్తు కాపాడారంటూ తల్లిదండ్రుల భావోద్వేగం చెందారు. మంత్రి లోకేశ్‌కు ఆనందభాష్పాలతో విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.