LIVE : శాసనసభలో బడ్జెట్‌పై సమాధానం ఇస్తున్న భట్టి విక్రమార్క - Tg Assembly Budget Session live - TG ASSEMBLY BUDGET SESSION LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jul 27, 2024, 10:05 AM IST
|Updated : Jul 27, 2024, 9:19 PM IST
Telangana Assembly Budget Session 2024 Live : తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత నేడు తిరిగి ప్రారంభమైంది. రెండు సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతోంది. ముందుగా ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇస్తున్నారు. ఆ తర్వాత శాసనమండలిలో సమాధానం ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో గురువారం ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క రూ.2.91 లక్షల కోట్లను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో సేద్యానికే దాదాపు 40 శాతం బడ్జెట్ అంటే రూ.72 వేల కోట్ల పైచిలుకు నిధులను కేటాయించారు. ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో రూ.45 వేల కోట్లును, ప్రాజెక్టులకు రూ.20 వేల కోట్లను కేటాయింపులు చేశారు. ఇది ప్రజా బడ్జెట్ అంటూ భట్టి విక్రమార్క కితాబు ఇచ్చారు. ఈ బడ్జెట్‌పై విపక్షాలు తీవ్రంగా దుమ్మెత్తి పోశాయి. అసలు ఇది రైతుల వ్యతిరేక బడ్జెట్ అంటూ మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Last Updated : Jul 27, 2024, 9:19 PM IST