శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రబలిన అతిసారం - నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి - Three Persons Died on Diarrhea - THREE PERSONS DIED ON DIARRHEA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 11:38 AM IST

Three People Died of Diarrhea in Sri Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో అతిసారం మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ముగ్గురు మృతి చెందడంతో స్థానికులు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం ఎం.రాయపురం గ్రామంలో ఈ మరణాలు సంభవించాయి. గత శనివారం నుంచి గ్రామంలో పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎంఅండ్​హెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చికిత్స అందిస్తున్నారు. అలాగే పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 

శనివారం నుంచి బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రత్నాచారి (65), పార్వతమ్మ (54)లు సోమవారం రాత్రి మృతి చెందారు. అలాగే శిరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హనుమంత రాయప్ప (75) మంగళవారం మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ గ్రామంలో పర్యటించి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. నీటి బోరు వద్ద పైప్ లైన్ లీకేజీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. గత వారంలో నియోజకవర్గంలోని కొంకలు గ్రామంలో అతిసారం లక్షణాలతో మరణాలు మరవకముందే తిరిగి రాయపురంలో అతిసారం ప్రబలడం ప్రజల్లో ఆందోళన రేకిత్తిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.