రామోజీరావు జీవితాన్ని పాత్రికేయులంతా ఆదర్శంగా తీసుకోవాలి : దేవినేని ఉమా - Devineni Uma tribute to Ramoji Rao - DEVINENI UMA TRIBUTE TO RAMOJI RAO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 17, 2024, 9:59 AM IST
Devineni Uma Pays tribute to Ramoji Rao : తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకే దక్కుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. పత్రికలను మారుమూల గ్రామాలకు చేర్చి రామోజీరావు స్థానిక వార్తలకు ప్రాధాన్యం కల్పించారన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 88 ఏళ్ల వయసులోనూ క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన పాటించిన రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు.
నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగి, ప్రజల్లో విశ్వసనీయత సాధించారన్నారు. సమాజహితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని కితాబిచ్చారు. రామోజీరావు జీవితాన్ని పాత్రికేయులంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో రామోజీ ది ప్రత్యేకమైన శకమని కీర్తించారు. రామోజీఫిల్మ్ సిటి ప్రపంచంలోనే గర్వంగా చెప్పుకునే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడియో అని, మార్గదర్శి, ప్రియా ఫుడ్స్ ఇలా ఎన్నో సంస్థల ద్వారా మరెంతో మందికి ఉపాధి కల్పించారని అన్నారు.