వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు పెరిగాయి : దేవినేని ఉమ - tdo leader Devineni Uma news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 4:46 PM IST
Devineni uma Fires on YCP Government in Ntr District : రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో "బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, మైలవరంలో 600 రోజులుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల సారథ్యంలో అన్న క్యాంటీన్ నడుస్తోందని తెలిపారు. అలాగే కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివనాథ్ అన్న క్యాంటీన్లు, మెడికల్ క్యాంపులతో చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం-జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని దేవినేని ఉమా స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దౌర్జన్యలు పెరిగిపోయాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని వర్గాలకు న్యాయం చేసే దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టారని మండిపడ్డారు. చివరికి నాడు-నేడు పేరు చెప్పి పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.