సంపద సృష్టించే వారిని ఎప్పుడూ గాయపరచం : భట్టి విక్రమార్క - ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ భట్టి
🎬 Watch Now: Feature Video
Published : Jan 28, 2024, 5:21 PM IST
Deputy CM Bhatti At Indian Builders Convention : నిర్మాణ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే పోటీ ప్రపంచంలో నిలుదొక్కుకోగలమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాణ రంగంలో పోటీ పెరిగిన దృష్ట్యా యంత్రాలను వాడి నాణ్యమైన కట్టడాలను త్వరితగతిన పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వం ఉందని, సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్డర్లు రుణాలు పొందడం కూడా సులువు అవుతుందని భట్టి తెలిపారు.
సంక్షేమ పథంలో రాష్ట్రాన్ని నడిపించాలంటే దానికి సంపద కావాలని, వాటిని సృష్టించే వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్నారు. అలాంటి వ్యవస్థలను, మనుషులను ఎప్పుడూ గాయపరచమని అన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందులను బిల్డర్స్ డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. ఈ ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న బిల్డర్లు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.