LIVE: సరస్వతి భూములు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ - ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 2:38 PM IST

Updated : Nov 5, 2024, 2:46 PM IST

Deputy Chief Minister Pawan Kalyan inspect Saraswati lands LIVE : మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూములను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట భూములు ఉన్నాయి. ఆ భూముల్లో అటవీ భూములు, ప్రభుత్వ భూములు, నీటి వనరులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆదేశించారు. వారం రోజుల క్రితం సరస్వతి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అటవీ, రెవెన్యూ అధికారులు ఓ నివేదికను అందించారు. నివేదికలో ఏముందనే విషయం బయటకు రాలేదు.  వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 15 వందల ఎకరాలకు పైగా భూములను సరస్వతి సిమెంట్స్ కంపెనీ కోసం కేటాయించారు. తెదేపా ప్రభుత్వం ఈ భూ కేటాయింపులు 2014 తర్వాత రద్దు చేసింది.పవన్ కల్యాణ్ వెంట ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్థానిక నేతలు, అధికారులు ఉన్నారు. భూములకు సంబంధించిన వివరాలను అధికారులు పవన్‌కు వివరించారు.
Last Updated : Nov 5, 2024, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.