LIVE నరెడ్కో ప్రాపర్టీ షో కు హాజరైన సీఎం చంద్రబాబు - గుంటూరు నుంచి ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU GUNTUR TOUR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2025/640-480-23294203-thumbnail-16x9-cm-chandrababu-inaugurate-naredco-property-show-live.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2025, 12:57 PM IST
|Updated : Jan 10, 2025, 2:18 PM IST
CM Chandrababu inaugurate Naredco Property Show Live : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. స్తంభాలగరవులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో నరెడ్కో ఆధ్వర్యంలో జరిగే స్తిరాస్థి ప్రదర్శనను ప్రారంభిచనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సీఎం వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, భద్రత ఏర్పాట్లపై చర్చించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే స్తిరాస్థి ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనుంది. మొత్తం 150 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అపార్టుమెంట్లు, విల్లాలతో పాటు, ఫ్లాట్లు విక్రయించేవారు, నిర్మాణ సామగ్రి కంపెనీలు ఒకేచోట కొలువుదీరనున్నాయి. సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11.40 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి గుంటూరులోని శ్రీ కన్వెషన్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 12.05 గంటలకు చేబ్రోలు హనుమయ్య కంపెనీ వద్దకు వెళ్తారు. నరెడ్కో ప్రాపర్టీ ప్రదర్శనను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు తిరుగు ప్రయాణమై వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
Last Updated : Jan 10, 2025, 2:18 PM IST