లక్ష గాజులతో ఏడుపాయల అమ్మవారికి అలంకరణ - చూస్తే వావ్ అనాల్సిందే! - Edupayala Temple In Medak - EDUPAYALA TEMPLE IN MEDAK
🎬 Watch Now: Feature Video
Published : Jul 14, 2024, 12:50 PM IST
Edupayala Temple Celebrations In Medak : ఆషాఢ మాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని ఆలయ అర్చకులు లక్ష గాజులతో దివ్యంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్మంచుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో తెల్లవారుజాము నుంచి భక్తులు నదీ స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Devotees rush in Edupayala Temple : ఆషాఢ మాసంలో ఐదు ఆదివారాల్లో ఐదు ప్రత్యేకతలతో అమ్మవారిని విశేష అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఛైర్మన్, ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.