వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి పిటిషన్‌పై విచారణ వాయిదా - Dastagiri Petition Postponed - DASTAGIRI PETITION POSTPONED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 9:14 PM IST
Dastagiri Petition Adjourned for Hearing in CBI Court : వివేకా హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలన్న దస్తగిరి పిటిషన్‌పై మళ్లీ వాదనలు వినాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. అప్రూవర్‌గా మారినందున తనను నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షుల్లో చేర్చాలని కోరుతూ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ (Dastagiri Petition in CBI court) వేశారు. గత నవంబరు 4 నుంచి దస్తగిరితో పాటు నిందితుల వాదనలు విన్న న్యాయస్థానం మార్చి 28న ఉత్తర్వులు వెల్లడించనున్నట్లు వెల్లడించింది. అయితే సీబీఐ కూడా వాదనలు వినిపించాలంటూ ఏప్రిల్ 8న పిటిషన్‌ను మళ్లీ తెరిచింది. సీబీఐ వాదనలు కూడా ముగియడంతో ఇవాళ తీర్పు వెల్లడించనున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల తీర్పు సిద్ధం కాలేదని న్యాయమూర్తి సీహెచ్ రమేష్ బాబు తెలిపారు. జడ్జి బదిలీ అయినందున పిటిషన్‌పై మళ్లీ ఇరువైపుల వాదనలు వినేందుకు మే 17కి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది.