పాఠశాలకు తండ్రి పేరు పెట్టిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి- గ్రామస్థులు ఆందోళన
🎬 Watch Now: Feature Video
Dalits Opposed The School Name of MLA Jaggireddy Father: కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని ప్రభుత్వం పాఠశాల ప్రారంభోత్సవంలో వివాదం చోటుచేసుకుంది. పాఠశాల భవనానికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తన తండ్రి పేరు సోమ సుందర్ రెడ్డి పేరు పెట్టడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకించారు. పాఠశాలకు మీ తండ్రి పేరు ఎలా పెడతావంటూ ఆందోళనకు దిగారు. గ్రామంలోని సిద్ధార్థ నగర్లో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాలను గోపాలపురం గ్రామంలో ఉన్న అవంతి సీ ఫుడ్స్ కంపెనీ వారు వాళ్ల సొంత ఖర్చులతో అభివృద్ధి చేశారు.
ఎమ్మెల్యే తన తండ్రి పేరు పెట్టి పాఠశాలను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్నఅంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జగ్గిరెడ్డి వెళ్లిపోయారు. అంబేడ్కర్ విగ్రహానికి వేసిన పూలమాలను దళితులు తీసేసి విగ్రహాన్ని పాలతో సుద్ధి చేశారు. ఎమ్మెల్యే వేసిన పూలమాలలు తీసేయటంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన కారులను పాఠశాల వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.