LIVE : కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ అంత్యక్రియలు - ప్రత్యక్షప్రసారం - D Srinivas final journey live
🎬 Watch Now: Feature Video
Published : Jun 30, 2024, 11:45 AM IST
|Updated : Jun 30, 2024, 3:46 PM IST
DS Funeral With State Honors : రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్‌గా ప్రాచుర్యం పొందిన డి. శ్రీనివాస్ మరణించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం రోజున గుండెపోటు రాగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్, పలు మార్లు ఆస్పత్రిలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ దురంధరుడిగా, తన వ్యూహాలతో చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు డీఎస్ మృతదేహాన్ని హైదరాబాద్ లోని నివాసంలో ఉంచారు. పార్లమెంట్ సమావేశాల కోసం దిల్లీలో ఉన్న చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వచ్చిన తర్వాత ఇందూరుకు తీసుకెళ్లారు. నగరంలోని నివాసంలో డీఎస్ పార్థివదేహాన్ని ఉంచగా, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, బంధువులు నివాళులు అర్పించారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్ జాతీయ నాయకులు, బీజేపీ జాతీయ నాయకులు నివాళులు అర్పించారు. డీఎస్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. నిజామాబాద్ నగర శివారులోని వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలను, ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
Last Updated : Jun 30, 2024, 3:46 PM IST