విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించండి: సీఎస్ - CS Review on Industrial Corridors - CS REVIEW ON INDUSTRIAL CORRIDORS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2024, 9:56 PM IST
CS Review on Visakhapatnam Chennai Industrial Corridor : విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించిన కనీస మౌలిక సదుపాయాలను తక్షణం చేపట్టాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, రహదారుల విస్తరణ, విద్యుత్, రహదారులు, నీటి వసతి వంటివి చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, ఏపీఐఐసీ, ఏపీఆర్టీసీ, ఏపీ ట్రాన్స్‌కో తదితర విభాగాల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి నివేదికలను సిద్దం చేసి సమర్పిస్తే ఈ నివేదికను ఆసియా అభివృద్ధి బ్యాంకుకు సమర్పించి సకాలంలో మిగతా నిధులు మంజూరయ్యోలా చూస్తామని సీఎస్ చెప్పారు.
విశాఖపట్నం-చెన్నె పారిశ్రామిక నడవాకు సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాలుగా ఇప్పటి వరకూ ఏపీఐఐసీ, ఏపీ ఆర్డీసీ, ఏపీ ట్రాన్సుకో, జీవీఎంసీలకు మంజూరు చేసిన నిధులు, అలాగే ఇప్పటి వరకూ జరిగిన పనుల ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటైతే మూడు ఆంధ్రప్రదేశ్‌తో అనుసంధానమై ఉన్నాయని వెల్లడించారు. అందులో విశాఖపట్నం-చెన్నై, చెన్నె-బెంగుళూరు, బెంగుళూరు-హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం-చెన్నె పారిశ్రామిక కారిడార్ అభివృధ్ధికి సంబంధించిన పనుల భౌతిక, ఆర్ధిక లక్ష్యాల ప్రగతిని, ఇతర అంశాలను సీఎస్ వివరించారు.