బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ఏ పార్టీకైనా మద్ధతిస్తాం: శ్రీనివాసరావు - Srinivasa Rao media conference

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 7:38 PM IST

CPM State Secretary Srinivasa Rao on BJP : రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి (BJP) ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్ధతు ఇచ్చే పార్టీలను ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. శ్రీనివాసరావు సృష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ఏ పార్టీకైనా మద్ధతిస్తామని అన్నారు. బీజేపీకి వివిధ అంశాల వారీగా మద్ధతిస్తున్నామని తిరుపతి సభలో సీఎం జగన్​ మోహన్​ రెడ్డి ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలపై జగన్​ ఎన్ని లక్షల కోట్ల భారాలను వేశారో తెలియజేయాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వైసీపీ పార్టీకే కాదు, టీడీపీ-జనసేన కూటమికి ఓటు వేసిన బీజేపీకే వేసినట్లే అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 26 అసెంబ్లీ, 3 లోక్​సభ స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించడానికి జగన్​ మోహన్​ రెడ్డి అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు అమలుపై అధికార పార్టీ తమ వైఖరిని వెల్లడించాలని కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.