'పౌర హక్కులను కాలరాసే కుట్ర- ధనిక, పేద వ్యత్యాసాన్ని పెంచిన మోదీ ప్రభుత్వం' - CPM Leader Sitaram Yechury
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 12:22 PM IST
CPM Leader Sitaram Yechury Comment on PM Modi : మతతత్వ ఘర్షణలు పెంచడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. పౌరహక్కుల్ని కాలరాసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం బహిరంగ సభలో సీతారాం ఏచూరి పాల్గొని ప్రసగించారు. పీఎం మోదీకి ఓటమి భయం పట్టుకుందని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దానిని కప్పించుకోవడానికి మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీని వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
మనదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం కాపాడాలన్న సంకల్పంతో పని చేస్తున్నారని తెలియజేశారు. దశాబ్దం కాలం నుంచి రాజ్యాంగాన్ని భ్రఘ్ట పట్టించడానికి మోదీ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో పేదరికం పెద్ద ఎత్తున ఉందని, దీని వల్ల దేశాన్ని ధనిక, పేదరికం అనే రెండు భారతదేశాలుగా సృష్టించడానికి మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.