వైసీపీ పాలనలో ఉపాధి లేక ఉద్యోగాలు రాక నిరుద్యోగుల అవస్థలు: సీపీఎం - CPM Jana Sankha Rao Padayatra

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 2:03 PM IST

CPM Jana Sankha Ravam Second Day Padayatra: జగన్ ప్రభుత్వం విజయవాడను అభివృద్ధికి చేసింది శూన్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు (CPM State Secretariat member CH Babu Rao) విమర్శించారు. వైసీపీ పాలనలో ఉపాధి లేక ఉద్యోగాలు రాక నిరుద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. జన శంఖారావం పేరుతో సీపీఎం ఆధ్వర్యంలో రెండో రోజు పాదయాత్ర మధురానగర్ ప్రాంతంలో సాగింది. 15 ఏళ్లయినా నేటికీ గుణదల ఫ్లైఓవర్ పూర్తికాలేదని విమర్శించారు. 

వాంబే కాలని, మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జిలను తక్షణమే నిర్మించాలని బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఎంసీ పరిధిలో నివసిస్తున్న ప్రజలపై గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలక పక్షం పన్నుల మోత మోగిస్తోందని బాబురావు దుయ్యబట్టారు. వైసీపీ నాయకుల అరాచకాలకు అంతు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో జగన్​ను గద్దె దించి ప్రజలు తగిన బద్ది చెప్తారని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.