ఆంధ్రులకు అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్‌ ఎందుకు ప్రశ్నించడంలేదు?: నారాయణ - సీఎం జగన్​పై సీపీఐ నారాయణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 10:44 AM IST

CPI Narayana Fire on CM Jagan: ఐదు కోట్లమంది ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను అదానీకి అప్పగించేందుకు కేంద్రం సిద్థమైందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తుండడంతో జగన్ మోదీ జపం చేస్తున్నారన్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాసిచ్చిన బూతులనే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. 

రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు సీఎం జగన్ కోడికత్తి కేసు తీర్పు రాకుండా పెండింగ్​లో పెట్టించారన్నారు. దీంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్​ కేసును కూడా పెండింగ్​లో పెట్టేందుకు ముఖ్యమంత్రే కారణమని ఆయన పేర్కొన్నారు. పొరపాటున బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ కేసుల్లో జగన్​కు అనుకూలంగా తీర్పులు రావనే ఉద్దేశంతో ఐదు కోట్లమంది ఆంధ్రులకు అన్యాయం జరుగుతున్నా జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడంలేదన్నారు. 

"ఐదు కోట్లమంది ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను అదానీకి అప్పగించేందుకు కేంద్రం సిద్థమైంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తుండడంతో జగన్ మోదీ జపం చేస్తున్నారు. జగన్ రాసిచ్చిన బూతులనే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు." - నారాయణ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.