LIVE : హైదరాబాద్‌లో సీపీఐ నేతల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CPI leaders pressmeet hyd live
🎬 Watch Now: Feature Video
Published : Feb 4, 2024, 2:28 PM IST
|Updated : Feb 4, 2024, 2:52 PM IST
CPI Live : సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. రహైదారబాద్ మగ్థూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరగనున్న సమావేశాలకు జాతీయ కార్యదర్శులు నారాయణ, అజీజ్ పాషా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ బలోపేతం అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు ముగ్గురు సభ్యులతో సీపీఐ కమిటీ వేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు జాతీయ కార్యదర్శి కె.నారాయణ, మరో నేత రామకృష్ణ పాండా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కేంద్ర కార్మిక, సంయుక్త్ కిసాన్ మోర్చా ఈనెల 16న చేపట్టిన సమ్మె, గ్రామీణ బంద్‌కు మద్దతు ఇవ్వాలని సీపీఐ తీర్మానించింది. కేంద్ర బడ్జెట్‌లో అసమానతలను తొలగించేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని నిరసన తెలియజేస్తూ మరో తీర్మానం చేసింది. పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో సమాధానం చెప్పాలని సీపీఐ డిమాండ్ చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ నేతలు పాల్గొన్నారు.