దాడులు కాదు - అభివృద్ధి చేసి వైసీపీ నేతలు ఓట్లు అడగాలి: సీపీఐ నేతలు - Ananta Venkatrami Reddy Issue

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 4:58 PM IST

CPI Fire on MLA Ananta Venkatrami Reddy Followers Attack on Woman: మహిళా పక్షపాతి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి (Jagan) అనంతపురంలో జిల్లాలో ఎమ్మెల్యే అతని అనుచరులు ఓ మహిళపై దాడి చేయటం గురించి ఏం సమాధానం చెప్తారని సీపీఐ నాయకులు (CPI Leaders)  ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు. తాగునీటి సరఫరా చేయడం లేదని ప్రశ్నిస్తే మహిళలపై దాడులు చేస్తారా అంటూ అనంతపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డిని సీపీఐ నాయకులు మండిపడ్డారు.

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సోమవారం పార్వతమ్మ కాలనీలో గడపగడకు కార్యక్రమం నిర్వహించారు. కాలనీకి వెళ్లిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని కుళాయిలో నీరు రావడం లేదని, తాగునీటికి చాలా కష్టమవుతోందని స్థానిక మహిళ లక్ష్మీదేవి నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు ఇంట్లోకి వచ్చి తనపై దాడి చేశారని లక్ష్మీదేవి పేర్కొన్నారు. దీనిపై సీపీఐ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతపురం సప్తగిరి కూడలిలో అర్దనగ్న ప్రదర్శనతో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి సోదరులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ప్రజలు సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, ఏ విధంగానైనా ప్రజలను భయపెట్టి గెలవాలని చూస్తున్నారని సీపీఐ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి దాడులు చేయించడం కాదని, అభివృద్ధి చేసి, ప్రజాసమస్యలు పరిష్కరించి ఓట్లు అడగటానికి వెళ్లాలని సీపీఐ నాయకులు సవాల్ చేశారు. బాధితురాలు లక్ష్మీదేవికి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, ఆయన సోదరుడు చంద్రారెడ్డిలు క్షమాపణ చేప్పాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.