మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమరనాథ్‌ ఇంటి ముట్టడి - న్యాయం చేయాలంటూ నినాదాలు - ap latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 7:08 PM IST

Congress Youth Leaders Protest at Minister Gudivada Amarnath House: మెగా డీఎస్సీ వెంటనే విడుదల చేయాలంటూ విశాఖ జిల్లా గాజువాకలోని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని ఆయన ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలించారు. మింది గ్రామంలోనూ మంత్రి ఇంటిని ముట్టడి చేయడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Demands on Mega DSC Notification in AP: ప్రభుత్వాన్ని మెగా డీఎస్సీ విడుదల చేయాలని కోరితే అరెస్టులు చేస్తారా అని నిలదీస్తూ నినాదాలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ విడుదల చేస్తానని హామీ ఇచ్చి, ఇటీవల కేవలం 6 వేల 100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్​ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్​ ఇవ్వాలని, లేని పక్షంలో మంత్రులందరి ఇళ్లను ముట్టడిస్తామని కాంగ్రెస్​ నేతలు హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.