LIVE : ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - సీఎం రేవంత్ రెడ్డి లైవ్
🎬 Watch Now: Feature Video
Published : Feb 2, 2024, 3:49 PM IST
|Updated : Feb 2, 2024, 5:28 PM IST
Congress Public Meeting in Indravelli LIVE : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇంద్రవెల్లి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంఖారావం పూరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి సభకు తెలంగాణ పునర్నిర్మాణ సభగా కాంగ్రెస్ నామకరణం చేసింది. సర్కార్ కొలువుదీరిన తర్వాత తొలి సభ కావడంతో హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి తొలిసారిగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం ఆవరణ వేదికగా జరిగిన ఆదివాసీ, గిరిజన, దళిత దండోరా సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు సీఎం హోదాలో అదే వేదికగా జరిగే తెలంగాణ పునర్నిర్మాణ సభలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సభ అయినందు హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.