సీఎం రేవంత్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు : బల్మూరి వెంకట్ - Congress MLC Fires On BRS - CONGRESS MLC FIRES ON BRS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-03-2024/640-480-21040616-thumbnail-16x9-mlc.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 21, 2024, 7:06 PM IST
Congress MLC Balmoori Venkat On BRS Social Media : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. నిజంగా తప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వదలిపెట్టదని తమది ప్రజా ప్రభుత్వమని, అనవసరంగా కావాలని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గాంధీభవన్‌లో కార్పొరేషన్ ఛైర్మన్‌లు ప్రీతమ్, మెట్టు సాయి, పార్టీ అధికార ప్రతినిధి లింగం యాదవ్, యూత్ కాంగ్రెస్ నేత రాజీవ్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎంపై లేనిపోని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టమని బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులు క్రిశాంక్‌ను ఉద్దేశించి అన్నారు. గతంలో మీడియా, సోషల్ మీడియాలను బీఆర్ఎస్, కేసీఆర్ ఎలా అణిచివేశారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌లుగా ఉన్నామని ఏదైనా మాట్లాడవచ్చుననుకుంటే కుదరదన్నారు. భజనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కేటీఆర్, కవిత కుటుంబం మెప్పు పొందాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ది జరుగకపోయినా జరిగిందని చెబుతున్నారని మండిపడ్డారు. మీకు కావాల్సిన ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో అనవసరమైన ఆరోపణలు చేస్తే తమ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందన్నారు.