LIVE : హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్‌మీట్ - Congress Leaders React on Notice - CONGRESS LEADERS REACT ON NOTICE
🎬 Watch Now: Feature Video
Published : Apr 29, 2024, 5:40 PM IST
|Updated : Apr 29, 2024, 5:47 PM IST
Congress Leaders React on Amit Shah Morphing Video Notice : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్, పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీశ్, ఆ పార్టీకి చెందిన నవీన్, శివకుమార్‌లకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు సమాచారం. అమిత్‌షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ ‘ఎక్స్’లో పోస్టు చేశారని దిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు స్పందించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై దిల్లీ పోలీసులు ఇచ్చిని నోటీసులపై కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయలను వెల్లడిస్తున్నారు.
Last Updated : Apr 29, 2024, 5:47 PM IST