రాష్ట్రంలో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రచార రథాల సందడి - Congress Campaign Vehicles Started - CONGRESS CAMPAIGN VEHICLES STARTED
🎬 Watch Now: Feature Video


Published : Apr 12, 2024, 6:54 PM IST
Congress Campaign Vehicles Started in Sangareddy : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 17 ఎంపీ స్థానాల్లో 14కి తగ్గకుండా నెగ్గాలని హస్తం నాయకులు ప్రజాక్షేత్రంలో కదులుతున్నారు. ప్రచారబాధ్యతలను నెత్తినెత్తుకున్న మంత్రులు గ్యారంటీల అమలును ప్రజలకు వివరిస్తున్నారు. ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తేనే, కేంద్రం నుంచి నిధుల విడుదలకు అవకాశం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు సాధిస్తామని బీజేపీ నాయకులు భ్రమల్లో ఉన్నారని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శించారు.
గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి నీలం మధుకు భారీ మెజారిటీ ఇచ్చి కేసీఆర్‌కు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని కోరారు. అనంతరం సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేశ్గడ్డలోని సిద్దివినాయక దేవస్థానం నుంచి ప్రచార రథాలను మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డికి మెదక్ సీటును బహుమతిగా ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ కార్యకర్తలకు సూచించారు.