ఎన్టీఆర్ జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రారంభం- పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు - Home Voting Process - HOME VOTING PROCESS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 4:44 PM IST
Collector inspected The Home Voting Process in NTR District: ఎన్టీఆర్ జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడలోని పోస్టల్ కాలనీలో హోమ్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. పోస్టల్ కాలనీలో ఇద్దరు వృద్ధులు హోం ఓటింగ్ ద్వారా తమ ఓటును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాగుల సౌకర్యార్థం ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించిందని కలెక్టర్ చెప్పారు.
జిల్లాలో 640 మంది వృద్ధులు, 412 మంది విభిన్న ప్రతిభావంతులు హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరికి ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించింది. 85 సంవత్సరాలు ఉన్నవాళ్లకి మాత్రమే హోమ్ ఓటింగ్ ఉండగా ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన చాలా మంది నడవలేక పోతున్నారని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. అందుకే కోసమే ఈ హోమ్ ఓటింగ్ ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 13న పోలింగ్‌కు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవడంతో వృద్దులు ఇబ్బంది పడతారని ముందుగానే హోమ్ ఓటింగ్ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.