రేపే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన - బ్యారేజీ లోపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సభ! - సీఎం మంత్రులు మేడిగడ్డ పర్యటన
🎬 Watch Now: Feature Video


Published : Feb 12, 2024, 1:52 PM IST
CM Revanth Reddy Tour Arrangement on Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వారి పర్యటన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బ్యారేజీ వద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సీఎం రేవంత్ బృందం ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణ లోపాలు ఎత్తి చూపేందుకు సీఎం బృందం సిద్ధమవుతోంది. బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకొనే విధంగా చదును పనులు చేస్తున్నారు. మేడిగడ్డ దిగువన, గోదావరి తీరానికి వెళ్లే మార్గాలను సులభతరం చేస్తున్నారు.
అదే విధంగా బ్యారేజీ సమీపంలో వ్యూ పాయింట్ ప్రాంగణం వద్ద సుమారుగా మూడు వేల మంది కూర్చునే విధంగా పనులు చేపట్టారు. అక్కడే మేడిగడ్డ బ్యారేజీ లోపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సభ నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పూర్తిగా బస్సు ద్వారానే మేడిగడ్డ బ్యారేజీకి చేరుకునే సందర్భంగా రహదారులను మెరుగుపరుస్తున్నారు. రహదారి, భవనాల శాఖ ఈఎస్సీ మోహన్ నాయక్ ఆదేశాలతో మేడిగడ్డ వెళ్లే మార్గాల్లో మరమ్మతులు చేపట్టారు. భద్రతాపరంగా ఆయా మార్లాల్లో పోలీస్ అధికారులు ప్రయాణించి పరిశీలించారు. బాంబు స్క్వాడ్‌తో రహదారులన్నీ తనిఖీ చేస్తున్నారు.