LIVE : ఖమ్మం వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం - CM Revanth On Khammam Floods - CM REVANTH ON KHAMMAM FLOODS
🎬 Watch Now: Feature Video
Published : Sep 2, 2024, 6:43 PM IST
|Updated : Sep 2, 2024, 7:58 PM IST
CM Revanth Review Meeting On Khammam Floods : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మంత్రులతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని అన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఖమ్మంలోని వరద సమస్యలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష ముగిసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా సీఎం రేవంత్ ఖమ్మం బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మున్నేరు వాగు చేసిన విధ్వంసాన్ని అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ఆ ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు.
Last Updated : Sep 2, 2024, 7:58 PM IST