LIVE : పటాన్చెరులో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్షప్రసారం - CM Revanth Reddy Public Meeting - CM REVANTH REDDY PUBLIC MEETING
🎬 Watch Now: Feature Video
Published : May 11, 2024, 11:43 AM IST
|Updated : May 11, 2024, 12:27 PM IST
CM Revanth Reddy Public Meeting at Patancheru : నేటితో లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు మొత్తం ప్రచారాన్ని నిలిపివేయాలి. ఈ క్రమంలో ప్రధాన పార్టీ నేతలు మరి కొద్ది గంటల్లో ముగిసే ఎన్నికల ప్రచారం కంటే ముందే ముమ్మరంగా ప్రచారాన్ని సాగించాలని భావిస్తున్నాయి. ఈ ఉన్న కొద్ది గంటలను సైతం వాడుకోవాలని చూస్తున్నాయి. ముందుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై చూసుకుంటూ పార్లమెంటు ఎన్నికల రథసారథిగా ముందుకు దూకుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని దాదాపు 17 నియోజకవర్గాల్లోనూ సీఎం రేవంత్ ప్రచారం సాగించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని ముందునుంచి కాంగ్రెస్ కోరుతుంటుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ తన వ్యూహాలకు పదునుపెడుతూ ఎక్కడ బలహీనంగా ఉన్నామో చూసుకుంటూ ఆ నియోజకవర్గంలో శరవేగంగా రాజకీయం అనేది మారి కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపేలా ప్రణాళికలు రచించింది. ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని గట్టిగా విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేశారు.
Last Updated : May 11, 2024, 12:27 PM IST