బ్యాడ్మింటన్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి - వీడియో వైరల్ - CM Revanth Reddy Play Badminton - CM REVANTH REDDY PLAY BADMINTON
🎬 Watch Now: Feature Video


Published : Sep 11, 2024, 1:57 PM IST
CM Revanth Reddy Play Badminton : తెలంగాణ పోలీస్ అకాడమీలో క్రీడా భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సరదాగా బ్యాడ్మింటన్‌ను ముఖ్యమంత్రి ఆడారు. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో సీఎం బ్యాడ్మింటన్ ఆడారు. అంతకుముందు అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అకాడమీలోని 547 మంది సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 145 మంది మహిళలు సహా 547 ఎస్ఐలు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి జ్ఞాపికలు అందజేశారు. పరేడ్‌లో మాట్లాడిన సీఎం రేవంత్, పోలీసుల పిల్లలకు అత్యున్నత విద్య అందిస్తామని మాటిచ్చారు.
హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి పిల్లలకు ఒకేచోట విద్య అందించనున్నామని వెల్లడించారు. పోలీస్ స్కూల్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ గ్రేహౌండ్స్ వద్ద విద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వరంగల్‌లో మరో విద్యాలయం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేసి, అందులో ఆరో తరగతి నుంచి పీజీ వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.