LIVE : కంటోన్మెంట్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో - CM Revanth Lok Sabha Campaign - CM REVANTH LOK SABHA CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : Apr 25, 2024, 7:35 PM IST
|Updated : Apr 25, 2024, 9:46 PM IST
CM Revanth Reddy Participate in Lok Sabha Election Campaign Live : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తమ అభ్యర్థుల నిలిచే చోట శరవేగంగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. వారికి మద్దతుగా నిలవాలని అన్ని నియోజకవర్గాల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా చేవెళ్ల లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో నారాయణ శ్రీ గణేశ్‌కు మద్దతుగా ప్రసంగించారు. అలాగే మరోవైపు ఉదయం 10.30 గంటలకు గాంధీభవన్‌లో బీజేపీపై ఛార్జ్‌షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే రాజేంద్రనగర్ చేవెళ్ల లోక్‌సభ పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
Last Updated : Apr 25, 2024, 9:46 PM IST