LIVE : పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్​ రెడ్డి ముఖాముఖి - CM Revanth Reddy live at lb nagar

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 4:02 PM IST

Updated : Aug 2, 2024, 4:59 PM IST

thumbnail
CM Revanth Reddy Meet with Promoted Teachers : హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్​ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారంతా సీఎం రేవంత్​ రెడ్డికి సత్కరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19,000 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు సాధించారు. దీంతో టీచర్స్​ కల నెరవేరినట్లు అయింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపి, సెకండరీ గ్రేడ్​ టీచర్లు, భాషా పండితులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. అంతకు పదోన్నతులు, బదిలీలకు అడ్డంగా ఉన్న చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పరిష్కరించడంతో వీరిందరికీ మేలు జరిగింది. ఎందుకంటే ఎడ్యుకేషన్​ డిపార్టుమెంట్​ను సీఎం తన వద్దే అంటిపెట్టుకుని ఉంచున్నారు. దీంతో ఈ వివాదంపై ప్రత్యేకం దృష్టి సారించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో టీచర్ల ప్రమోషన్లకు మార్గం సుగమం అయింది. వివాదాలకు తావులేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్‌ 1, 2 పరిధిలోని గవర్నమెంట్, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మేలు జరిగింది. పదోన్నతుల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ విధానమంతా ఆన్‌లైన్‌లో పారదర్శకతతో పూర్తి చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Last Updated : Aug 2, 2024, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.