LIVE : దొడ్డి కొమరయ్య కురుమ భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ - ప్రత్యక్ష ప్రసారం - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Dec 14, 2024, 5:18 PM IST
|Updated : Dec 14, 2024, 6:17 PM IST
CM Revanth Reddy Live : కోకాపేట్‌లోని దొడ్డి కొమురయ్య కురమ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని నెం.1గా నిలపాలనేదే తన లక్ష్యమని వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లుగా వెల్లడిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని చెబుతున్నారు. ఇప్పటికే రైతులకు రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు లాంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మరోవైపు యువతకు నైపుణ్యాలను పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లాంటివి ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా కొకాపేట్లో దొడ్డి కొమురయ్య కురుమ భవనం ప్రారంభించి అనంతరం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : Dec 14, 2024, 6:17 PM IST