LIVE : నాంపల్లిలో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి - CM REVANTH LIVE

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 12:16 PM IST

Updated : Sep 9, 2024, 1:28 PM IST

thumbnail
CM Revanth inaugurate IIHT LIVE : ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి నాంపల్లిలో ఏర్పాటుచేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని ప్రారంభించారు. ప్రభుత్వం నేతన్నలకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత నైపుణ్యంలో శిక్షణకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత రంగంలోని కొత్త పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు దేశంలో కేవలం ఆరు ప్రాంతాల్లో మాత్రమే ఐఐహెచ్‌టీలు ఉన్నాయని. ఈ సంస్థ ఏర్పాటుతో ఏటా 60 మంది విద్యార్థులకు చేనేత, టెక్స్‌టైల్స్‌ సాంకేతికతలో మూడేళ్ల డిప్లొమా కోర్సు అభ్యసించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. శిక్షణ తర్వాత విద్యార్థులకు చేనేత, టెక్స్‌టైల్స్‌లో డిప్లొమా సర్టిఫికేట్‌ అందజేస్తామని స్పష్టం చేశారు.
Last Updated : Sep 9, 2024, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.