గణేశ్​ వేడుకల్లో మనవడి తీన్మార్​ స్టెప్పులు - చూసి మురిసిపోయిన సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth Grandson Dance - CM REVANTH GRANDSON DANCE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 10:07 AM IST

CM Revanth Grandson Reyansh Reddy Dance : వినాయక చవితి నవరాత్రోత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగాయి. గల్లీ గల్లీకి ఓ వినాయకుడిని నెలకొల్పి, సంబురాలు అంబరాన్నంటేలా వేడుకలు చేసుకున్నారు. వినాయక మండపాల వద్ద ఆటపాటలతో భక్తులు కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. విజ్ఞేశ్వరుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ, ప్రత్యేక పూజలు ఆచరిస్తూ ఆ గణనాథుని స్తుతించారు. అదే సమయంలో భజనలు, కీర్తనలు, డ్యాన్స్‌లు, డీజే పాటలతో హోరెత్తించారు. ఇక సోషల్ మీడియాలో అయితే మొత్తం వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే వైరల్​గా మారాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మనవడు చేసిన డ్యాన్స్​ వీడియో ఒకటి ప్రస్తుతం బాగా ఆకట్టుకుంటోంది.

జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన గణేశ్​ నిమజ్జనం సమయంలో రేవంత్​ మనవడు రేయాన్ష్ రెడ్డి​ వేసిన చిందులు నెట్టింట ఇప్పుడు వైరల్​గా మారాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా గణేశ్​ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్​రెడ్డి మనుమడు చిందులేసి సందడి చేశాడు. వినాయకుని నిమజ్జనానికి వెళ్తున్న వాహనం ముందు తీన్మార్​ స్టెప్పులు వేశాడు. జై బోలో మహరాజ్​కీ జై అంటూ ఆడిపాడాడు. తమ మనమడి చిందులకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దంపతులు మురిసిపోయారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.