LIVE : రవీంద్ర భారతిలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న సీఎం రేవంత్​రెడ్డి - CM Revanth Appreciate to Students - CM REVANTH APPRECIATE TO STUDENTS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 3:30 PM IST

Updated : Jun 10, 2024, 4:09 PM IST

CM Revanth Attend in Felicitation Program of 10th Class Toppers : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేళ తీరికలేకుండా సభలు సమావేశాలతో గడిపిని సీఎం రేవంత్​ రెడ్డి, ఎన్నికలు ఫలితాలు మిశ్రమంగా రావడంతో వాటిపై సమీక్షలు జరిపారు. తాజాగా దేశంలో మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్​లో, తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు సమష్ఠి కృషి చేయాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో కోడ్​ ముగియడంతో ఇప్పుడిప్పుడే రాష్ట్ర పాలనపై సీఎం దృష్టి సారిస్తున్నారు. ఈక్రమంలోనే రవీంద్ర భారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి హాజరయ్యారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను అందించిన విద్యార్థులకు సీఎం చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం విద్యార్థులతో రేవంత్​రెడ్డి మాటామంతి జరిపారు.
Last Updated : Jun 10, 2024, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.