LIVE : నారాయణపేట జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth Reddy Campaign
🎬 Watch Now: Feature Video
Published : Apr 23, 2024, 4:18 PM IST
|Updated : Apr 23, 2024, 4:36 PM IST
CM Revanth Reddy Campaign IN Kodangal LIVE : మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. మోదీ, కేసీఆర్, ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. ఈసారి తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాలను గెలిచి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5లక్షల ఇళ్లు నిర్మించాలని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభించామని తెలిపారు. పేదోడికి సొంత ఇల్లు ఉంటే గౌరవంగా జీవిస్తారని, ఆ దిశగానే తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రధాని మోసం చేశారని ఆక్షేపించారు. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోసం చేశారని తెలిపారు.
Last Updated : Apr 23, 2024, 4:36 PM IST